*శ్రౌత శైవ మార్గం..వేదసార శివానుభూతి*

 *శ్రౌత శైవ మార్గం..వేదసార శివానుభూతి*

శ్రౌత శైవం అనగా వేదశాస్త్రాధారంగా శివుని రుద్రస్వరూపంగా ఆరాధించే మార్గం.
యజుర్వేదంలోని శతరుద్రీయం..రుద్రసూక్తం వంటి మంత్రాలే ఇందులో ప్రధాన ఆధారాలు..
శివుని సృష్టికర్తగా (భవ), సంహారకుడిగా (రుద్ర), రక్షకునిగా (మృత్యుంజయ) పూజించటం జరుగుతుంది.
కాశీ, కేదార్, ఉజ్జయిని వంటి ఉత్తర భారత క్షేత్రాల్లో శ్రౌత శైవం పాటించబడుతుంది..
వేదఘోషలతో రుద్రాభిషేకం, హోమకర్మలు, శాంతి కర్మలు శ్రౌతాచారంగా జరుగుతాయి..
శివుని రూపాన్ని త్ర్యంబక, నీలకంఠ, విశ్వేశ్వర, కాలాగ్ని మొదలైన విశ్వగుణాత్మక స్వరూపంగా నిర్వచిస్తారు.
దక్షిణ భారత దేశంలో..శ్రీశైలం..శ్రీ మల్లికార్జున స్వామి..శ్రీ భ్రమరాంభిక దేవి..జ్యోతిర్లింగం..శక్తి పీఠం..అయిన ఈ క్షేత్రంలో వేద గోషతో కూడిన పూజా విధానాలు నిత్య కర్మగా నడుస్తున్నాయి..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రౌత శైవ ఆగమ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక.. కేరళ తదితర రాష్ట్రాలలో కూడా శ్రౌత శైవ పద్ధతుల్లో లెక్కకు మిక్కిలి ఆలయాలలో నిత్య కర్మలు జరుగుతున్నాయి..
*నమః శివాయ చ శివతరాయ చ* అనే వాక్యం శివుని పరబ్రహ్మత్వాన్ని సాక్షాత్కరిస్తుంది..
దక్షిణాదిలో వేద..ఆగమ మార్గం కలగలిపిన శ్రౌతశైవ ఆచారాలు ఉన్నా..వేదాధిక్యం స్పష్టంగా గోచరిస్తుంది..
శివుడు భయహర్త..భక్తులయందు అనుగ్రహశీలి..జగత్తుని ధరించే జగదాధారుడు.. వేదోక్త నిర్గుణభక్తి..జ్ఞానయోగములను సమన్వయించే పరమేశ్వరతత్త్వమే శ్రౌత శైవ ఆరాధ్యంగా ప్రతిష్టింపబడింది.
శివుని త్రిగుణాతీత..సర్వైక్య స్వరూపాన్ని శతరుద్రీయం వేదసిద్ధంగా ప్రకటిస్తుంది..
శ్రౌత శైవ మార్గంలో జపం..హోమం.. అర్చనలద్వారా ఆత్మలింగతత్త్వంతో అనుసంధానం పొందటమే ప్రధాన లక్ష్యం..
ఈ మార్గంలో గురువు మార్గదర్శకుడిగా, వేదదీక్ష సాధనపథంగా, నియమ నిష్టలు శాశ్వతమైన సాధనాశీలతగా విలసిస్తాయి.
శివుడు ‘ఋతం సత్యం’ అనే వేదవాక్యానికి ప్రత్యక్షంగా నిలిచిన పరమేశ్వరుడు.
శ్రౌత శైవం అనేది భక్తిని జ్ఞానంతో అనుసంధానించే శుద్ధ మార్గం..శివానుభూతికి మేలుకొలుపు.
(సశేషం) *శివ దర్శనం* వ్యాస సంపుటిలో అంతర్భాగం*..
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ

Comments

Popular posts from this blog

శ్రుయోతశైవ margam

శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు