Posts

Showing posts from July, 2025

అంత్యేష్టి గోష్ఠి

  *అంత్యేష్టి గోష్టి* *శైవ సాంప్రదాయంలో లింగసమాధి తత్వం* *వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే  పార్వతీపరమేశ్వరౌ!!*  *మాకు శాంభవ దీక్ష అనుగ్రహించిన కైలాస వాస్తవ్యులు పరమ పూజ్యులు మా గురుదేవులు శివశ్రీ నిర్మల శంకర శాస్త్రి గారి చరణారవిందములకు శరణులు*  శైవ సాంప్రదాయం అనేది కేవలం ఒక భక్తి మార్గం కాదు. ఇది ఒక సంపూర్ణ జీవన శాసనం..  ఇందులో శివుని ఆరాధన మాత్రమే కాక  జీవితపు ప్రారంభం నుండి సమాప్తి వరకు శాస్త్రబద్ధమైన..ఆత్మీయమైన.. తత్త్వపూరితమైన విధానం ఏర్పడింది.. ముఖ్యంగా లింగధారణ నుండి లింగైక్యం వరకు సాగే ఈ మార్గంలో  మరణానంతరం నిర్వహించబడు ఖనన విధానం (లింగసమాధి), మహేశ్వర శ్రాధ్ధం..మహేశ్వరార్చన వంటి అంశాలకు శాస్త్ర ప్రామాణికత ఉంది.. *లింగధారణము - శివపథానికి ప్రతిజ్ఞ* లింగాన్ని ధరించటం అనేది శివునికి మనచే సమర్పణ..ఇది సాధారణ ఆచారం కాదు. శైవ ఆగమాల ప్రకారం.. *లింగధారణం శివపథమప్రాప్త్యర్థం* (కామికాగమం) అంటే శివుని పధంలో ప్రవేశించేందుకు చేసే తొలి సంకల్పం..లింగాన్ని ధరించిన తరువాత  శరీరం శివుని ఆలయంగా పరిగణించబడుతుంది. *లింగధారి శరీరం - శివస్...

శ్రుయోతశైవ margam

 *శ్రౌత శైవ మార్గం..వేదసార శివానుభూతి* శ్రౌత శైవం అనగా వేదశాస్త్రాధారంగా శివుని రుద్రస్వరూపంగా ఆరాధించే మార్గం. యజుర్వేదంలోని శతరుద్రీయం..రుద్రసూక్తం వంటి మంత్రాలే ఇందులో ప్రధాన ఆధారాలు.. శివుని సృష్టికర్తగా (భవ), సంహారకుడిగా (రుద్ర), రక్షకునిగా (మృత్యుంజయ) పూజించటం జరుగుతుంది. కాశీ, కేదార్, ఉజ్జయిని వంటి ఉత్తర భారత క్షేత్రాల్లో శ్రౌత శైవం  పాటించబడుతుంది.. వేదఘోషలతో రుద్రాభిషేకం, హోమకర్మలు, శాంతి కర్మలు శ్రౌతాచారంగా జరుగుతాయి.. శివుని రూపాన్ని త్ర్యంబక, నీలకంఠ, విశ్వేశ్వర, కాలాగ్ని మొదలైన విశ్వగుణాత్మక స్వరూపంగా నిర్వచిస్తారు. దక్షిణ భారత దేశంలో..శ్రీశైలం..శ్రీ మల్లికార్జున స్వామి..శ్రీ భ్రమరాంభిక దేవి..జ్యోతిర్లింగం..శక్తి పీఠం..అయిన ఈ క్షేత్రంలో వేద గోషతో కూడిన పూజా విధానాలు  నిత్య కర్మగా నడుస్తున్నాయి..  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రౌత శైవ ఆగమ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు..  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక.. కేరళ తదితర రాష్ట్రాలలో కూడా శ్రౌత శైవ పద్ధతుల్లో లెక్కకు మిక్కిలి ఆలయాలలో నిత్య కర్మలు జరుగుతున్నాయి.. *నమః శివాయ చ శివతర...

కాశీనాథుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ

**శివశ్రీ కాశీనాధుని  పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారు**  **వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే  పార్వతీపరమేశ్వరౌ*  నిత్య శివారాధకులు..జీవితాన్నే అమ్మవారి సేవకు అంకితం చేసుకొన్నవారు..కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం... గణార్చనలో కార్తీక మాసమంతా  గురువుగా  ఆసీనులైనటువంటి శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర భాపేశ్వర శర్మ గారు మహా శివ పూజా దురంధరులు ..మృదుస్వభావి..   నిర్మల మనస్కులు...సహృదయులు ఆదర్శ జీవనము కొనసాగిస్తున్న ఆరాధనీయులు గత నాలుగు సంవత్సరముల నుండి  విజయవాడ శ్రీ శైవ మహా పీఠ కార్తీక మాస గణార్చనలో అన్నిరోజులు గురుస్థాన పూజ్యులై  ఆరాధ్య బంధువులకు ఆశీస్సులు అందిస్తున్నారు...  శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర భాపేశ్వర శర్మ గారు..కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి మునిమనవలు..  శర్మ గారి తండ్రి గారు పూర్ణ విజయ వరప్రసాద్ అయ్యవారు..తాతగారు కాశీనాధుని వీరభద్రయ్య అయ్యవారు..అందరికీ బుల్లబ్బాయి గా ప్రసిద్ధులు..  మంత్ర శాస్త్రంలో ప్రజ్ఞా ప్రావీణ్యులు... శ్రీవిద్య మహావిద్య.. సాక్షాత్ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న పు...

శ్రీశైల శిఖర దర్శన ప్రాశిస్త్యం

 *శ్రీశైల శిఖర దర్శన ప్రాశస్త్యం* దక్షిణ భారతాన శ్రీశైలం అనేది ఒక మహత్తరమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.  నల్లమల అడవుల మధ్య ఆవిర్భవించిన పవిత్ర పర్వతరాజము.  ఈ క్షేత్రానికి మూలాధారమైన శ్రీశైల శిఖర దర్శనం ఆధ్యాత్మిక యాత్రకు జీవనసారం. *శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే* దర్శన ప్రాశస్త్యానికి ఉన్న విశిష్టత వెల్లడవుతుంది. అక్షరాలా ఈ శిఖరాన్ని తిలకించినవారికి మళ్లీ జన్మ ఉండదు అంటే  ముక్తి మార్గంలో స్థిరపడతారు అన్నది ఆ గంభీరమైన అర్థం. లౌకిక శరీరాన్ని శైవ స్వరూపంగా మార్చే దివ్య యాత్ర ఈ శిఖరాన్ని చూసే క్షణం ఒక జీవిత కాలం తపస్సుకు సమానం..ఎందుకంటే ఇది దృష్టిలో గోచరించేదే కాని హృదయంలో నిలిచిపోయే దైవిక ప్రకాశం. విశేషంగా శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి సహస్వరూపంగా వెలసిన ఈ పర్వతం పంచభూతాల ప్రకృతికి పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరిస్తుంది.. ఈ శిఖరాన్ని దూరాన నుంచైనా దర్శించినవారు, తమలోని అపవిత్రతలు నశించబడి దివ్య దర్శనాన్ని పొందుతారు. ఈ శిఖరం శివనామ స్మరణకు..ప్రకృతి సహజతకు నిదర్శనం.. శ్రద్ధతో శిఖర దర్శనం చేసినవారు తమ కర్మ బంధాలను దాటి పునర్జన్మ రహితులగుదు...

శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు

 **శ్రీ శైవ మహా పీఠం పూజ్య ఉప పీఠాధి పతులు శివశ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున  ప్రసాద్ గారు* *గ్రంథానుసంధాన విభావిత శైవతత్త్వ శోభితః, జ్ఞానార్చనా సహస్రధీ ప్రబోధక యోగేశ్వర శైవారాధ్య!* రాజమండ్రి వాస్తవ్యులు ...  వారి మాటల్లో రాజమండ్రి పట్ల ఎంతో ప్రేమ తొణికిసలాడింది  ... సహజమేకదా  అంటారా  ... కావొచ్చు ..అయితే నాకు రాజమండ్రి లోని వారి శిష్యుల  పై వారికున్న అవ్యాజమైన వాత్సల్యం రూపంలో రాజమండ్రి కనిపించింది  ...   వీరి తాత గారు ..నాయనమ్మ    ..తల్లి తండ్రి పై వారికి గల భక్తి ప్రపత్తులు  ఎంత చెప్పిన తక్కువే .. తాత గారు మల్లికార్జున శాస్త్రి గారు శాంభవ దీక్ష నొసగిన   గురువులు .. విద్యా గురువులు తండ్రి గారు... వీరికి అక్షారాభ్యాస గురువులు ...శివశ్రీ శ్రీపతి పండితారాధ్యుల శరభారాధ్యుల   వారు .బెజవాడ.. వాస్తవ్యులు ... శివశ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు వీరి తండ్రి గారు.. వీరు సంస్కృతాంధ్ర  పండితులు..వీరు  పాతిక పైగా పుస్తక రచనలు చేసి వున్నారు .  కాంచి ఖండము  ...మాతృదాస్య  విమోచనము  ... ఉత్తర నైష...

శైవరాధ్యులు భాగ్యనగరం

 *శైవారాధ్యులు భాగ్యనగరం* పూజ్య పీఠాధిపతులకు పాదాభివందనం 🙏 ఆరాధ్య ఆత్మీయ బంధువులకు నమస్సులు 🙏                శైవం శైవ సాంప్రదాయం ఒక జీవన విధానంగా జీవిస్తున్న మనమంతా అదృష్టవంతులం..సమాజంలో జరిగే అన్ని ఇక్కడా వున్నాయి మనం అతీతులం కాదు.. కొన్ని అవాంఛనీయ సంఘటనలు శైవ పీఠ ఎన్నికలలో చోటు చేసుకొన్నాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రక్రియలో అంతా శ్రమిస్తున్నాం..ఒక్కోటి గాడిన పడేసే అవకాశం వుంది..శైవ పీఠం..శాఖలు అన్ని సమస్యలకు పరిష్కారాలు వున్నాయి పరిష్కరించబడాలి.. సంయమనం..సౌభ్రాతృత్వం..సుహృద్భావం సాధ్యమే..శైవ కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు శైవ మహా పీఠం అనుబంధంగా కొన్ని శాఖలు అనుబంధంగా  లేకున్నా కొన్ని శాఖలు తమ తమ కార్యక్రమాలతో అలరింపజేస్తున్నాయి అందులో సందేహం లేదు..కొన్ని శాఖలు స్వయం ప్రతిపత్తితో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాయి.. అనుబంధం లేకున్నా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..ఆహ్వానించాల్సినదే.. అందరికీ పీఠాధిపతి ఒక్కరే..ఎక్కడ ఆరాధ్య శైవ కార్యక్రమం జరిగినా వారు వచ్చి ఆశీర్వదిస్తూనే ఉన్నారు..   మహేశ్వరి మహేశ్వరులు అందరూ చక్కట...

శ్రీ శైవరాధ్య darsanam

*శ్రీ శైవారాధ్య దర్శనం* 27-06-2025  *శివశ్రీ ముత్యంపేట కేదార్నాథ శర్మ గారు* అర్ధబోధల అంధకారమున నలిగిన నా లోకజీవితానికి, ఆకాశగంగవలె జ్ఞానప్రకాశాన్ని పారవేసిన వారే నా శైవారాధ్యులు.. నేను ఈ గ్రంథంలో పొందుపరుస్తున్నది, మహేశ్వరులు దర్శించిన శివతత్త్వపు ధ్వని, వారి జీవనంలో కనిపించే తపోమూర్తి స్వరూపం, వారు బోధించిన నిశ్శబ్దపు సందేశం. శివతత్త్వాన్ని పాఠ్యముగా గాక, జీవముగా ఆచరించిన గురుస్వరూపాలను ఈ చిన్న ప్రయత్నములో నేను స్మరించుచున్నాను. ఇది గ్రంథం కాదు – గురుభక్తి దీపిక. ఇది చరిత్ర కాదు – శివానుభూతి పరిమళిత గురుప్రభావ గాధ. ఇది రచన కాదు – శివచేత జాగృతమై నా హృదయంలో జలపాతంవలె వెల్లివచ్చిన కృతజ్ఞతా ఘడియలు ప్రతి వారం మహేశ్వరీ మహేశ్వరుల స్మరిస్తూ శ్రీ శైవారాధ్యులకు నా పద పదార్థముల అంకితమిదే! **వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే  పార్వతీపరమేశ్వరౌ** **సదాశివ సమారంభాం నీలకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం**    **శివశ్రీ ముత్యంపేట కేదార్నాథ్ శర్మ గారు** శ్రీశ్రీశ్రీ  మల్లికార్జున పండితారాధ్యులు..  శివయోగి శ్రీ శ్రీ శ్రీ కేదారనాథ స్...

*శ్రౌత శైవ మార్గం..వేదసార శివానుభూతి*

 *శ్రౌత శైవ మార్గం..వేదసార శివానుభూతి* శ్రౌత శైవం అనగా వేదశాస్త్రాధారంగా శివుని రుద్రస్వరూపంగా ఆరాధించే మార్గం. యజుర్వేదంలోని శతరుద్రీయం..రుద్రసూక్తం వంటి మంత్రాలే ఇందులో ప్రధాన ఆధారాలు.. శివుని సృష్టికర్తగా (భవ), సంహారకుడిగా (రుద్ర), రక్షకునిగా (మృత్యుంజయ) పూజించటం జరుగుతుంది. కాశీ, కేదార్, ఉజ్జయిని వంటి ఉత్తర భారత క్షేత్రాల్లో శ్రౌత శైవం పాటించబడుతుంది.. వేదఘోషలతో రుద్రాభిషేకం, హోమకర్మలు, శాంతి కర్మలు శ్రౌతాచారంగా జరుగుతాయి.. శివుని రూపాన్ని త్ర్యంబక, నీలకంఠ, విశ్వేశ్వర, కాలాగ్ని మొదలైన విశ్వగుణాత్మక స్వరూపంగా నిర్వచిస్తారు. దక్షిణ భారత దేశంలో..శ్రీశైలం..శ్రీ మల్లికార్జున స్వామి..శ్రీ భ్రమరాంభిక దేవి..జ్యోతిర్లింగం..శక్తి పీఠం..అయిన ఈ క్షేత్రంలో వేద గోషతో కూడిన పూజా విధానాలు నిత్య కర్మగా నడుస్తున్నాయి.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రౌత శైవ ఆగమ పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక.. కేరళ తదితర రాష్ట్రాలలో కూడా శ్రౌత శైవ పద్ధతుల్లో లెక్కకు మిక్కిలి ఆలయాలలో నిత్య కర్మలు జరుగుతున్నాయి.. *నమః శివాయ చ శివతరాయ చ* అనే వాక్యం శివు...