శ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు
**శ్రీ శైవ మహా పీఠం పూజ్య ఉప పీఠాధి పతులు శివశ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు*
*గ్రంథానుసంధాన విభావిత శైవతత్త్వ శోభితః, జ్ఞానార్చనా సహస్రధీ ప్రబోధక యోగేశ్వర శైవారాధ్య!*
రాజమండ్రి వాస్తవ్యులు ... వారి మాటల్లో రాజమండ్రి పట్ల ఎంతో ప్రేమ తొణికిసలాడింది ... సహజమేకదా అంటారా ... కావొచ్చు ..అయితే నాకు రాజమండ్రి లోని వారి శిష్యుల పై వారికున్న అవ్యాజమైన వాత్సల్యం రూపంలో రాజమండ్రి కనిపించింది ...
వీరి తాత గారు ..నాయనమ్మ ..తల్లి తండ్రి పై వారికి గల భక్తి ప్రపత్తులు ఎంత చెప్పిన తక్కువే .. తాత గారు మల్లికార్జున శాస్త్రి గారు శాంభవ దీక్ష నొసగిన గురువులు ..
విద్యా గురువులు తండ్రి గారు...
వీరికి అక్షారాభ్యాస గురువులు ...శివశ్రీ శ్రీపతి పండితారాధ్యుల శరభారాధ్యుల వారు .బెజవాడ.. వాస్తవ్యులు ...
శివశ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారు వీరి తండ్రి గారు.. వీరు సంస్కృతాంధ్ర పండితులు..వీరు పాతిక పైగా పుస్తక రచనలు చేసి వున్నారు . కాంచి ఖండము ...మాతృదాస్య విమోచనము ...
ఉత్తర నైషధము ...ఉత్తమ మనుసంభవము ఇంకా ఎన్నో ... వీరు మన పూజ్య పీఠాధిపతి శివశ్రీ అత్తలూరి మృత్యుంజ శర్మ గారితో కలిసి ఓరుగల్లు లో శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంద్ర కళాశాలలో పనిచేసినారు .. అయితే అప్పటి ముల్కి గొడవల వల్ల వీరేశ్వర శర్మ గారు రాజమండ్రి వెళ్లి పోయినా అప్పటి సెక్రటరీ శివశ్రీ భండారు చంద్ర మౌళేశ్వర రావు గారు నెల నెలా పైకం పంపేడివారట.. వీరి శంకరారాధ్య చరిత్ర ప్రసిద్ధ రచన ..వీరు 1976 లో శ్రీశైలం దేవస్థానం వారిచే సన్మానించబడినారు ...1977 శివరాత్రి రోజు లింగైక్యం చెందారు...
**శివశ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు.... గొప్ప శివారాధకులు ., ఈశ్వర సంకల్పంచేత వారికి ఆధ్యాత్మిక సాహిత్య సేవ కలిగిందని చెబుతారు .*..
*సాహిత్య విద్య ప్రవీణ ...భాష ప్రవీణ ..శాస్త్రీయం (శిక్ష ) ఏం ఏ ...సంస్కృతం చదువుకున్నారు ...
రాజమండ్రి లోని స్కూల్లో మరియు ప్రభుత్వ కళాశాలలో సంస్కృతం బోధించేవారు ..వారానికి 36 పీరియడ్లు పనిచేసేవారంటే ..వృత్తి పట్ల వారి నిబద్దత అర్ధం చేసుకోవచ్చు వారికి శిష్యుల యందు ప్రేమ అభిమానము వల్ల ఇప్పటికి శిష్యులు వచ్చి పోతుంటారు ....
వీరి ఆచార్య వృత్తి నుండి విరమణ జరిగిన తదుపరి గొల్లపూడి వీరా స్వామి పుస్తక పబ్లిషర్లు వీరిని మొట్టమొదట ప్రూఫ్ రీడర్గా నియోగించుకున్నారు .. తదుపరి 20 సంవత్సరాలు ఒక వంద పుస్తకముల వరకు ఆధ్యాత్మిక పుస్తక రచనలు .. పరిష్కారములు చేసిన గొప్ప ఆధ్యాత్మిక రచయిత ...
శ్రీ చక్ర సామ్రాజ్యము మీద నాలుగు పుస్తకములు ...రుద్రభాష్యము ..నమక ..చమక ..భావము ..నమశ్శివాయ ఓం అని ఒక పుస్తకం వ్రాసారు ..స్థూలం లో నుండి సూక్ష్మం లోకి వెళుతున్నామని భావన చేసి వ్రాసి వున్నారు ..ఎన్నో పుస్తకములు వ్రాసిన సరస్వతి పుత్రులు ...
రాజమండ్రి లోని వీరింటిలో ఎప్పటికి విద్యార్థులు ఉండి చదువుకునేవారట ... అప్పట్లో బొంబాయి పరీక్షలు చిత్తూరు పరీక్షలు ...హైదరాబాద్ పరీక్షలు .ఉండెడివి... ఎంతో మంది విద్యార్థులు ఆంధ్ర దేశమంతటా వీరి శిష్యులే ఉన్నత స్థితి కలిగియున్నారు వీరి రచనలు ఎన్నో వున్నాయి శ్రీగణేశ ..లక్ష్మి ఆరాధనా .. శివ పూజ కు సంబంధించి పదిహేను పుస్తకములు వ్రాసినారు .విశిష్ట శివపూజలు ప్రాచుర్యం లో ఉన్నవి ....
**పూజ్య ఉప పీఠాధి పతులు శివశ్రీ మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారు** శైవ మహాపీఠం అభ్యున్నతికి .. శైవ ప్రచార వ్యాప్తికి ..తోడ్పడుతూ పండిత మండలి అందరికి అందుబాటులో ఉంటున్నారు ... విశేషించి ఆరాధ్య కుటుంబాలకు ఆత్మీయులు ...(సశేషం)
పూజ్య ఉప పీఠాధిపతులకు ప్రణమిల్లుతూ ....
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
9348298600...
Comments
Post a Comment