శైవరాధ్యులు భాగ్యనగరం
*శైవారాధ్యులు భాగ్యనగరం*
పూజ్య పీఠాధిపతులకు పాదాభివందనం 🙏
ఆరాధ్య ఆత్మీయ బంధువులకు నమస్సులు 🙏
శైవం శైవ సాంప్రదాయం ఒక జీవన విధానంగా జీవిస్తున్న మనమంతా అదృష్టవంతులం..సమాజంలో జరిగే అన్ని ఇక్కడా వున్నాయి మనం అతీతులం కాదు.. కొన్ని అవాంఛనీయ సంఘటనలు శైవ పీఠ ఎన్నికలలో చోటు చేసుకొన్నాయి వాటిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రక్రియలో అంతా శ్రమిస్తున్నాం..ఒక్కోటి గాడిన పడేసే అవకాశం వుంది..శైవ పీఠం..శాఖలు అన్ని సమస్యలకు పరిష్కారాలు వున్నాయి పరిష్కరించబడాలి.. సంయమనం..సౌభ్రాతృత్వం..సుహృద్భావం సాధ్యమే..శైవ కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు శైవ మహా పీఠం అనుబంధంగా కొన్ని శాఖలు అనుబంధంగా
లేకున్నా కొన్ని శాఖలు తమ తమ కార్యక్రమాలతో అలరింపజేస్తున్నాయి అందులో సందేహం లేదు..కొన్ని శాఖలు స్వయం ప్రతిపత్తితో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాయి.. అనుబంధం లేకున్నా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..ఆహ్వానించాల్సినదే.. అందరికీ పీఠాధిపతి ఒక్కరే..ఎక్కడ ఆరాధ్య శైవ కార్యక్రమం జరిగినా వారు వచ్చి ఆశీర్వదిస్తూనే ఉన్నారు..
మహేశ్వరి మహేశ్వరులు అందరూ చక్కటి ఆరోగ్యవంతమైన ఎన్నికలను నిర్వహించుటకు సిద్ధమయ్యారు ముదావహం..జంటనగరాలలో 20 ఏళ్లకు పైబడి ఈ శాఖ ఎన్నో కార్యక్రమాలను ఎంతోమంది మహోన్నత వ్యక్తులు నిర్వహించారు..ఈసారి మొట్టమొదటి ఎన్నికల సంరంభంలో నలుగురు అధ్యక్షులుగా పోటీకి వచ్చారు..ఒకరు పరిశీలనలో సాంకేతిక కారణంగా తిరస్కరించబడ్డారు..మీ ఆధ్యాత్మిక అనుభవం ఖచ్చితంగా ఇక్కడ అవసరమే..పోటీలో ముగ్గురు ఉన్నారు..వారితో కార్యవర్గ సభ్యులు అంతా కూడా చక్కగా పోటీలో పాల్గొంటున్నారు..మాకు మాతృ సంస్థ అయిన జంట నగర శాఖ పురోభివృద్ధికి మేము సదా సిద్దమే..మాకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ ఏర్పడినప్పటి నుండి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం..వారు మా కార్యక్రమాలకు విచ్చేశారు..మేము వారి కార్యక్రమాలకు వెళుతూ ఉన్నాము..ఇక్కడ మన కార్యక్రమాల ద్వారా అందరినీ మనం కలుపుకోవాలి..అంతా ఆరాధ్య కార్యక్రమాలకు తమకు అనువైన చోట వెళ్లి వస్తుంటారు..ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లడమే..ఈరోజు మనం ఉంటాం రేపు వేరొకరు వస్తారు..ఈ ఎన్నికల తర్వాత ఎవరు వచ్చినా మనమంతా ఆరాధ్యులం మన కార్యక్రమాలన్నీ శైవ సాంప్రదాయాలే..కొన్ని సమస్యలను అంతా కలిసి పరిష్కరిద్దాం..అనుభవజ్ఞులు పెద్దవారి సలహాలు స్వీకరిద్దాం..శంకరారాధ్య మఠం కవాడిగూడ ఎండోమెంట్ అయినా ఆరాధ్యులకు ఆలంబన అక్కడ మొదటి నుండి మనవారే ఉండడం మనకు శైవులకు దక్కుతున్న అదృష్టం..అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు మనమంతా వెళ్తున్నాం వెళ్లాలి..
మనమంతా ప్రథమ కర్తవ్యంగా రుద్రభూమికై కలిసి నడుద్దాం..అందరికీ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కొరకు సమిష్టి నిర్ణయాలతో వెళ్దాం..మన వారిని కూడా ప్రత్యేకమైన గౌరవపదవుల్లో నియమించుకుందాం..ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడు అంతా మన చేతుల్లోనే ఉంది..భాగ్యనగర ఆరాధ్యులు ఎంతోమంది చర్చించిన తదుపరి సహృద్భావం పరిఢవిల్లాలని మా అభిలాష..ఎవరి ప్రయత్నాలు వారు స్నేహపూర్వకంగా చేయండి నూతనంగా వచ్చేవారిని ఆత్మీయంగా ఆహ్వానిద్దాం..జంట నగర శాఖ మనకు గర్వకారణమైనది..ఎన్నికల పండుగలొ పోటీలో వున్న మహేశ్వరీ మహేశ్వరులకు
ప్రతి ఒక్కరికి పేరు పేరునా మా హృదయ పూర్వక అభినందనలు..శుభాకాంక్షలు..
భవదీయులు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
అధ్యక్షులు
మరియు కార్యవర్గము.
శ్రీ శైవ మహాపీఠం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ.
Comments
Post a Comment