శ్రీశైల శిఖర దర్శన ప్రాశిస్త్యం
*శ్రీశైల శిఖర దర్శన ప్రాశస్త్యం*
దక్షిణ భారతాన శ్రీశైలం అనేది ఒక మహత్తరమైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
నల్లమల అడవుల మధ్య ఆవిర్భవించిన పవిత్ర పర్వతరాజము.
ఈ క్షేత్రానికి మూలాధారమైన శ్రీశైల శిఖర దర్శనం ఆధ్యాత్మిక యాత్రకు జీవనసారం.
*శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే*
దర్శన ప్రాశస్త్యానికి ఉన్న విశిష్టత వెల్లడవుతుంది. అక్షరాలా ఈ శిఖరాన్ని తిలకించినవారికి మళ్లీ జన్మ ఉండదు అంటే ముక్తి మార్గంలో స్థిరపడతారు అన్నది ఆ గంభీరమైన అర్థం.
లౌకిక శరీరాన్ని శైవ స్వరూపంగా మార్చే దివ్య యాత్ర
ఈ శిఖరాన్ని చూసే క్షణం ఒక జీవిత కాలం తపస్సుకు సమానం..ఎందుకంటే ఇది దృష్టిలో గోచరించేదే కాని హృదయంలో నిలిచిపోయే దైవిక ప్రకాశం. విశేషంగా శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా దేవి సహస్వరూపంగా వెలసిన ఈ పర్వతం పంచభూతాల ప్రకృతికి పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరిస్తుంది..
ఈ శిఖరాన్ని దూరాన నుంచైనా దర్శించినవారు, తమలోని అపవిత్రతలు నశించబడి దివ్య దర్శనాన్ని పొందుతారు. ఈ శిఖరం శివనామ స్మరణకు..ప్రకృతి సహజతకు నిదర్శనం..
శ్రద్ధతో శిఖర దర్శనం చేసినవారు తమ కర్మ బంధాలను దాటి పునర్జన్మ రహితులగుదురు..
శ్రీశైల శిఖరాన్ని దర్శించటమే తపస్సు చేసిన ఫలితంగా భావించబడుతుంది. ఇది భౌతిక యాత్ర కాదు..ఇది జీవుని అజ్ఞానం నుండి జ్ఞానానికీ బాహ్య వాస్తవాలనుండి అంతర్ముఖతవైపు జరిగే మార్గం.
ముక్తి మార్గంలో ఒక నిశ్చల దివ్య పీఠం.
శివుని అనుగ్రహాన్ని కోరే వారు శరణాగత భక్తులుగా శ్రీశైల శిఖర దర్శనం ప్రథమ కోరికగా ఉండాలి..ఇది శివ దర్శనానికి బీజ రూపం. జీవాత్మ-పరమాత్మల కలయికకు ప్రతీకగా నిలిచే ఈ శిఖరం, ఆత్మ సాక్షాత్కారానికి తలుపుల్ని తెరిచే తంత్రమైన తాళం..
శ్రీశైల శిఖర దర్శనం అనేది కేవలం పర్వత దర్శనం కాదు..అది శివ తత్వ దర్శనం...భక్తుని లోతైన భవ సాగరాన్ని దాటించే ఆధ్యాత్మిక నౌక. ఇది జన్మల పునరావృత చక్రాన్ని తెంచే దివ్య జ్ఞానశిఖరం..
శ్రీశైల శిఖరం శివతత్వానికి జీవరూప దర్శనం..
*****
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
Comments
Post a Comment