కాశీనాథుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ
**శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారు**
**వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ*
నిత్య శివారాధకులు..జీవితాన్నే అమ్మవారి సేవకు అంకితం చేసుకొన్నవారు..కనకదుర్గ అమ్మవారి అనుగ్రహం...
గణార్చనలో కార్తీక మాసమంతా గురువుగా ఆసీనులైనటువంటి శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర భాపేశ్వర శర్మ గారు మహా శివ పూజా దురంధరులు ..మృదుస్వభావి..
నిర్మల మనస్కులు...సహృదయులు ఆదర్శ జీవనము కొనసాగిస్తున్న ఆరాధనీయులు గత నాలుగు సంవత్సరముల నుండి విజయవాడ శ్రీ శైవ మహా పీఠ కార్తీక మాస గణార్చనలో అన్నిరోజులు గురుస్థాన పూజ్యులై ఆరాధ్య బంధువులకు ఆశీస్సులు అందిస్తున్నారు...
శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర భాపేశ్వర శర్మ గారు..కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి మునిమనవలు..
శర్మ గారి తండ్రి గారు పూర్ణ విజయ వరప్రసాద్ అయ్యవారు..తాతగారు కాశీనాధుని వీరభద్రయ్య అయ్యవారు..అందరికీ బుల్లబ్బాయి గా ప్రసిద్ధులు..
మంత్ర శాస్త్రంలో ప్రజ్ఞా ప్రావీణ్యులు... శ్రీవిద్య మహావిద్య.. సాక్షాత్ అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్న పుణ్యచరితులు..
శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారు శైవాగమము.. దేవతా ప్రతిష్టలు.. వైదిక ధర్మములను క్రతువులను..తాత తండ్రుల నుంచి అభ్యసించి స్వగ్రామమైన ఎలకుర్రు అగ్రహార దేవాలయం ..మచిలీపట్నం తదితర ప్రాంతాలలో.. రామలింగేశ్వర స్వామి వంటి దేవాలయాలలో .. స్థానాచార్యులుగా కొనసాగిన బ్రహ్మమూర్తులు....శర్మ గారు మేధా దక్షిణామూర్తి...వీరభద్రుడు మరియు శ్రీ విద్యా ఉపాసకులు..
భారత రైల్వే శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసినారు..
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ గా కూడా పని చేసినారు.. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్..
వీరికి నాటకానుభవం..ఇంద్రజాలవిద్యలో ప్రావీణ్యం.. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి రివార్డులు అవార్డులు సాధించిన కళానిధి....
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో వీరి పూర్వీకులు గురువులుగా కొనసాగినారని ప్రతీతి...
దేవతా అలంకరణలో వీరు చేయి తిరిగిన మేటి..వీరభద్రుడు అమ్మవారు అనేక దేవతా మూర్తుల కన్నుల పండుగగా అలంకరించే మహద్భాగ్యులు అవి మనం ప్రత్యక్షంగా వీక్షించవలసినదే..
శర్మ గారి
శ్రీమతి హైమవతి గారు గృహిణిగా సహధర్మచారినిగా ఆదర్శ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.. వీరు సినీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారికి స్వయానా మేనకోడలు...శివశ్రీ శర్మ గారు
శ్రీ శైవ మహాపీఠం విజయవాడ శాఖలో జాయింట్ సెక్రటరీగా తమ సేవలను వినియోగించిన వారు...పండితమండలి సభ్యులు..(సశేషం)
మహనీయులైన శివశ్రీ పూర్ణ రవీంద్ర బాపేశ్వర శర్మ గారి గురించి వ్రాసే భాగ్యం లభించడం..మా అదృష్టం..
శర్మ గారికి ఆత్మీయ నమస్సులు అర్పించుకుంటూ...
మీ ఆరాధ్య బంధువు
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
Ph..9348298600.
Comments
Post a Comment