శ్రీ శైవరాధ్య darsanam
*శ్రీ శైవారాధ్య దర్శనం*
27-06-2025
*శివశ్రీ ముత్యంపేట కేదార్నాథ శర్మ గారు*
అర్ధబోధల అంధకారమున నలిగిన నా లోకజీవితానికి, ఆకాశగంగవలె జ్ఞానప్రకాశాన్ని పారవేసిన వారే నా శైవారాధ్యులు..
నేను ఈ గ్రంథంలో పొందుపరుస్తున్నది, మహేశ్వరులు దర్శించిన శివతత్త్వపు ధ్వని,
వారి జీవనంలో కనిపించే తపోమూర్తి స్వరూపం,
వారు బోధించిన నిశ్శబ్దపు సందేశం.
శివతత్త్వాన్ని పాఠ్యముగా గాక, జీవముగా ఆచరించిన గురుస్వరూపాలను
ఈ చిన్న ప్రయత్నములో నేను స్మరించుచున్నాను.
ఇది గ్రంథం కాదు – గురుభక్తి దీపిక.
ఇది చరిత్ర కాదు – శివానుభూతి పరిమళిత గురుప్రభావ గాధ.
ఇది రచన కాదు – శివచేత జాగృతమై నా హృదయంలో జలపాతంవలె వెల్లివచ్చిన కృతజ్ఞతా ఘడియలు
ప్రతి వారం మహేశ్వరీ మహేశ్వరుల స్మరిస్తూ
శ్రీ శైవారాధ్యులకు నా పద పదార్థముల అంకితమిదే!
**వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే । జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ**
**సదాశివ సమారంభాం నీలకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం**
**శివశ్రీ ముత్యంపేట కేదార్నాథ్ శర్మ గారు**
శ్రీశ్రీశ్రీ మల్లికార్జున పండితారాధ్యులు..
శివయోగి శ్రీ శ్రీ శ్రీ కేదారనాథ స్వామి వారు.. ఐదు కోట్ల శివ పంచాక్షరి జపానుష్టాన సిద్ధగురువులు..
మహా శివ పూజా దురంథరులు..
అసంఖ్యాక శిష్య పరంపరగల మహిమాన్విత గురువర్యులు..
సాహితీ బంధు..
పౌరాణిక ప్రవీణ..
శ్రీ శైవ మహా పీఠం పండితమండలిచే
అర్ష ధర్మ ప్రదీపక..బీరుదాంకితులు
ప్రవచనా మనోజ్ఞ ..
కేవలం నాలుగు నెలల కాలంలో 24 వేల శ్లోకాలు
శ్రీ వాల్మీకి రామాయణ సంపూర్ణ గ్రంథ పఠనం.
వివరణాత్మక ప్రవచనములు చేసిన సందర్భంలో
అభినవ వాల్మీకి..
15 సంవత్సరాల వయస్సు నుండి తెలుగు సంస్కృతం హిందీ మరాఠీ భాషలలో ధార్మిక ఉపన్యాసాలు చేసిన ప్రజ్ఞా పాటి..
కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ మహా శివ కోటి మందిరము నిర్మించడం
శ్రీ కేదారేశ్వర ఆశ్రమం..
వీరి ఆధ్యాత్మిక చింతనకు
తార్కాణం..
స్పటిక నందీశ్వర సహిత శ్రీ శ్రీ శ్రీ సాయుజ్య ముక్తేశ్వర స్వటిక మహా లింగ దర్శనం..
12 జ్యోతిర్లింగములు 7 మోక్షపురములు...
పంచారామాలు దర్శించిన పుణ్యఫలం కలుగుతుంది..
శివ శ్రీ ముత్యంపేట కేదార్నాథ శర్మ గారు..
సంస్కృత ఆంధ్ర భాషలలో అనేక ఆధ్యాత్మిక గ్రంథములను రచించిన సరస్వతీపుత్రులు..
శ్రీ మాన్ మరింగంటి శ్రీ రంగాచార్యులు గారు అనేకమంది గురువర్యుల అనుగ్రహంచే
వీరి దీక్షా గురువులైన శివశ్రీ రామగిరి గణేశ్వర శర్మ గారి ఆశీర్వాదం..
వీరు శబ్దార్థ వివరణా కోవిధులు.
అనేకమంది మహామహులచే వారి వంశంలో మహోద్ధండుల ఆధ్యాత్మిక వాతావరణం స్వతసిద్ధంగా వీరికి గల నూతన విషయ శోధన.. రచన బోధన.. సంగీతం.. ఈశ్వర అనుగ్రహం చే భక్తి సాధన తో తపస్సుతో పరమేశ్వరుని మెప్పించుట అందరికి ఆత్మీయ వాత్సల్యాన్ని అందించడం..అందరి ప్రేమను పొందడం..వారి సుగుణానికి మెరుగులుదిద్దింది...సహధర్మచారిని శ్రీమతి భవాని దేవి గారు వారికి తోడునీడగా వారిని కంటికి రెప్పలా చూసుకునే మహా సాధ్వి..
వీరిచే విరిచితమైన ఆధ్యాత్మిక ప్రచురణలు పేరే న్నికగన్నవి ఫూంఖానుపుంఖాలు..
సాంస్కృతిక ఆధ్యాత్మిక సుసంపన్నులైన వీరు **భక్తి సుధా..శ్రీ గౌరీ మానస పూజ..ప్రణుతి...జీవన సాఫల్యం ...శైవం..నిత్య ధర్మదీపిక...శివ జ్యోతి...ముక్తిసాధన. శివామృతం శ్రీ కాశీ క్షేత్ర మహిమ... మాతృ కటాక్షం..దేవీ వైభవం...నిత్య శివ పూజా విధి..శ్రీ కాలభైరవ కృప...శ్రీ కాళేశ్వర క్షేత్ర మహిమ..మోక్ష శ్రీ...జయం..అమృతం...గో మహిమ. మాతృగయ..శాంతి ధార ...శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహత్యము...శ్రీ గాయత్రీ సిద్ధి.. శ్రీ గాయత్రీ వరప్రాప్తి...సంపూర్ణ మణిద్వీప వర్ణన..శివదీక్ష విధి...శ్రీ కేదార గౌరీ వ్రతకల్పము...శివ స్తుతి ద్విశతి...శివ చాలీసా..పితృయజ్ఞ క్రియా సూచిక...ఉప జ్యోతిర్లింగ దర్శనం..శ్రీ వినాయక చతుర్థి విశేష పూజా విధి..కాశీ మోక్షపురి..**
అనేక రచనల **ఆధ్యాత్మిక సాహితీ ధురీణ**
*కైలాస వాస్తవ్యులు శివశ్రీ ముత్యంపేట కేదార లింగారాధ్యులు అవతార పురుషులు ... కేదార్నాథ్ శర్మ గారి తాతగారు వీరు గొప్ప శివ పూజా దురంధరులు ... అనేక శిష్య పరివారము కలవారు ..
వీరు శిష్య సంచారం చే అనేక ప్రాంతాలు పర్యటించెడివారు...ఒకానొక సందర్భంలో సకుటుంబముగా శిష్య గణములతో కూడి సంచార నిమిత్తము ఎడ్ల బండ్లలో అడవి మార్గం లో వెళుతూ పూజ సమయము కావటంచే ఆగినారు .. ఆడవాళ్లు వంట పనిలో నిమగ్నమయ్యారు ..
శివశ్రీ కేదారాలింగారాధ్యులు శివపూజ పేటికలో వారి ధర్మ పత్ని అన్ని సర్దిపెట్టినారు ...
వీరు పూజ ప్రారంభించి బిల్వ దళ మంత్రం వొచ్చింది చూడగా అందులో బిల్వదళం కనపడలేదు ..అయ్యో బిల్వదళం లేదే అని ఇది అంతా అడవియే కదా చూడండి అని అందరికి చెప్పారు ...ఎంత వెదికినా వారికి బిల్వదళం వృక్షం గాని మొక్క గాని కన్పించలేదు ...ఇంతలో అడవిలో సంచరించే ఒక వ్యక్తి కనపడ్డాడట చూడగా వాడు భయంకరంగా కోరమీసాలతో .. పెద్ద జుట్టుతో భుజాన ఒక గొడ్డలితో వున్నాడు .. అతనిని చూసి ఆడవారు అంతా దొంగ కావచ్చని సొమ్ములు దోచుకుంటాడేమో భీతి చెందారు .. ఎవరు మీరు వంట చేస్తున్నారు నాకు బాగా ఆకలిగా వుంది అన్నం పెట్టండి అని అన్నడట ... ఇది వినగానే అలాగేనాయన నాకు పూజకు బిల్వదళాలు లేవు కాస్త తెచ్చి పెట్టగలవా అని కేదారాధ్యులు బతిమిలాడితే సరే అని అవి యెట్లా వుంటాయని అడిగితే ఆరాధ్యులు గారు ఇలా మూడు ఆకులు కలిగి తొడిమతో వుంటాయని చెప్పగా విని అక్కడ బండ్లు ఆగి వున్నదగ్గర ఎద్దులు మేత మేస్తున్నాయి చూడగా వాడికి అక్కడే ఒక మొక్క కన్పించింది ఇదేంటి ఇక్కడే వుంది అని దాని పెరికి ఇచ్చాడు **అచ్చిద్రయి కోమలై శుభే ** అని లేత లేత ఆకులు ఛిద్రము లేనివి అవి చూసి నువ్వు దేముడవయ్యా అని వాటితో తన పూజ ముగించుకొన్నారు ..
అయ్యా మీరు అందరు తరువాత తినండి నాకు ముందు పెట్టండి అని అతను అనగా .. అయ్యవారు వారితో మా ఇద్దరికీ పెట్టండి అని తన ముగ్గు పట్టు పై బోజనమునకీ కూచున్నారు .. అతను చూస్తే ఒక పది మంది తినే అన్నం ఒక్కడే తిన్నట్టు వున్నాడు అయినా ఆఖరిగా అందరు తిన్న ఒక కబళం బుక్క మిగిలే వున్నది ... అతనితో వారు ముచ్చట్లు చెప్పి మాతో నువ్వు రా బండిలో అని అంటే అలా నడుస్తూ వస్తూ కొంత సేపటికి మాయం అయ్యాడు ..ఇది చూసి అయ్యో ఏరి అతను కన్పించడే అని ఇతను ఎవరో కాదు ఈశ్వరుడే ఆ రూపంలో నాకు బిల్వదళాలు ఇచ్చి వెళ్లాడని పరమానంద భరితుడయ్యాడు ...
శివశ్రీ ముత్యంపేట కేదారనాథ శర్మ గారు వారి తాతగారు మరియు తండ్రి గారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండేడి వారు .. వీరి వ్రాసిన పద్యములను ఒక పుస్తకంగా అచ్చువేసి వారికీ సభక్తికంగా సమర్పించుకున్నారు ...*
అజాత శత్రువు..
కామారెడ్డి లో వీరు తెలియని గడపలేదు..
రెండు తెలుగు రాష్ట్రములలో వీరి రచనలతో ఉత్తేజితులయిన వారు అనేకులు గలరు...(సశేషం)
**దైవత్వం ఉట్టిపడే తేజస్సుతో సాక్షాత్ శివ స్వరుపులయిన పుంభావ సరస్వతులకు**
శిరసా నమస్సులు అర్పిస్తూ..
భవదీయుడు
శ్రీపతి పండితారాధ్యుల సతీష్ చంద్ర శర్మ
📞9348298600
Comments
Post a Comment